న్యూఢిల్లీ: ఇంగ్లాండులో తొలి సారిగా కనిపించిన కొత్త రకం కరోనా భారత్‌లోకీ ప్రవేశించింది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురిలో ఈ రకం కరోనాను వైద్యులు గుర్తించారు. నెల రోజుల వ్యవధధిలో అక్కడి నుంచి 33 వేల మన దేశానికి వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. బెంగళూరులో ముగ్గురు, హైదరాబాద్‌లో ఇద్దరు, పూణేలో ఒకరికి కొత్త రకం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆరుగురిని ప్రత్యేక గదిలో ఉంచి కేంద్ర వైద్య బృందం పరీక్ష పరీక్షలు నిర్వహిస్తోంది. వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది.