హైదరాబాదు: అగ్రి గోల్డ్ నిందితులు – సంస్థ ఛైర్మన్ అవ్వా వెంకట రామా రావు, ప్రమోటర్లు అవ్వా వెంకట శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. సోమవారం వారిని చంచల్గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. డిపాజిట్ల పేరుతో వసూలు చేసిన సొమ్ముతో కూడబెట్టుకున్న మరిన్ని ఆస్తులు, విదేశాలకు తరలించిన సొమ్ము వివరాలపై విచారించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రశ్నించనున్నారు. నిందితులు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మంది నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన రూ.4,109 కోట్ల విలువైన ఆస్తులను ఈ నెల 24న ఈడీ స్వాధీనం చేసుకుంది. విదేశాలకూనిధులను తరలించినట్లు గుర్తించారు. ఈ నెల 22న రామారావు, శేషు నారాయణరావు, హేమసుందర ప్రసాద్లను అరెస్టు చేసింది.న్యాయ స్థానం వారిని చంచల్గూడ జైలులో బంధించాలని ఆదేశించింది. ముగ్గురినీ జనవరి 5 వరకు ప్రశ్నించేందుకు న్యాయస్థానం నుంచి వారికి అనుమతించింది.