‘ఆగదు మా పోరాటం ఎన్నటికీ’

న్యూ ఢిల్లీ: కేంద్రం తమ మాట వినకపోతే తమ తదుపరి అడుగు -ఫార్ములా 66 అని రైతు సంఘం నేతలు హెచ్చరించారు. కేంద్రంతో మరోసారి చర్చల సందర్భంగా తేల్చి చెప్పారు.‘ఉద్యమం ప్రారంభించి ఇప్పటికి 33 రోజులు. చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం మా మాట వినకపోతే మేం ఫార్ములా 66 ని అమలు చేస్తాం. అంటే ఇప్పటికి రెట్టింపు రోజులు మా ఆందోళనని కొనసాగిస్తాం’ అని రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ సోమవారం ఇక్కడ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం 33వ రోజుకు చేరు కుంది. రైతుల సంఘాల నేతలతో కేంద్రం ఐదు సార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. వారి సమస్యల పరిష్కారానికి ఒక సమితిని నియమించాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos