అయోధ్యపై రేపు జరుగాల్సిన విచారణ రద్దు

-జస్టిస్ బోబ్డే అందుబాటులో లేకపోవడమే కారణం
న్యూఢిల్లీ, జనవరి 27: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై మంగళవారం జరుగాల్సిన విచారణను సుప్రీంకోర్టు ఆదివారం రద్దు చేసింది. ఈ కేసును విచారించాల్సిన రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు సభ్యుల్లో ఒకరు (జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే) అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఈ కేసుపై ఈ నెల 29వ తేదీన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జరుపాల్సిన విచారణ రద్దయిందని, ఈ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే 29న అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఓ నోటీసును జారీచేసింది. అయోధ్య స్థల వివాద కేసును విచారించాల్సిన రాజ్యాంగ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేతోపాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కేసు విచారణకు కొత్త తేదీని ఇంకా నిర్ణయించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos