అమరావతి: రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు అంటారు.. పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3 స్థానంలో ఉండటం దారుణం అన్నారు. రాజధాని అమరావతి రైతులు 372 రోజులుగా ఉద్యమిస్తున్నారు. 10 మందికిపైగా అన్నదాతలు అమరులయ్యారు. వరదలు, భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుకు పరిహారం అడిగితే సభలో మాపైనే దాడికి తెగబడ్డారు. మాహయాంలో ఇచ్చినట్లు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందించాల’ని డిమాండ్ చేశారు.