శ్రీ వారి మెట్టు వద్ద ఉద్రిక్తత

శ్రీ వారి మెట్టు వద్ద ఉద్రిక్తత

తిరుపతి: ఇక్కడి శ్రీ వారి మెట్టు వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. వందలాది కిలోమీటర్లు కాలినడకన వచ్చిన తమను తిరుమలకు శ్రీవారి మెట్టు ద్వారా అనుమతించడం లేదని ఆగ్రహించారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమను ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడ్డారు. శ్రీవారి దర్శనానికి అనుమతించాలంటూ భక్తులు రోడ్డుపైనే భజన చేస్తూ నిరసన తెలిపారు. తితిదే పాలక మండలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంద మందికి పైగా యాత్రికులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు మొహరించారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు మాత్రం తమను కొండపైకి అనుమతించాలని కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos