న్యూఢిల్లీ : వచ్చే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిధిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కాలేక పోచ్చని బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్ డాక్టర్ చాంద్ నాగ్పాల్ తెలిపారు. బ్రిటన్లో కరోనా కొత్త రూపం దాల్చి విజృంభిస్తుండటం ఇందుకు కారణం. జాన్సన్ భారత్ పర్యటనపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయాన్నీ తీసుకోలేదు. కరోనా వ్యాప్తి కొనసాగితే పర్యటన రద్దు కావచ్చున్నారు. పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. క్రిస్మస్ వేడుకల్నీ నిషేధించారు