న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ట్విట్టర్ లో ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందిస్తున్న దేశాల జాబితాను జతపరిచారు. ‘ప్రపంచంలో 23 లక్షల మందికి కరోనా టీకా అందింది. చైనా, యూఎస్, యూకే, రష్యా ఇప్పటికే టీకాల వితరణ ప్రారంభించాయి. మరి మన వంతు ఎప్పుడు వస్తుంది మోదీ?’అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఫైజర్, భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీకాలను రూపొందించాయి. వీటిని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించాల్సి ఉంది.