బెంగళూరులో అడుగిడిన లండన్ కరోనా

బెంగళూరులో అడుగిడిన లండన్ కరోనా

బెంగళూరు : బ్రిటన్‌లో రూపు మార్చుకుని విస్తరిస్తున్న కరోనా ఉద్యాన నగరిలోకి అడుగిడిందనే వార్తలు నగర వాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. లండన్‌ నుంచి ఇటీవల నగరానికి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నగరంలోని 197వ వార్డుకు చెందిన వసంతపుర విఠలనగరకు ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలియడంతో ఆరోగ్య శాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని, వారి నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పుణెకు పంపారు. మరో వైపు డిసెంబరు 19న బ్రిటన్‌ నుంచి 38 మంది నగరంలోని బొమ్మనహళ్లికి వచ్చారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వీరిలో ఆరేళ్ల బాలిక, 35 ఏళ్ల తల్లి ఉన్నారు. వారి నుంచి సేకరించిన నమూనాలకు కూడా పుణెకు పంపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos