కస్టమ్స్​ ఆఫీస్​లో బంగారం చోరీ

కస్టమ్స్​ ఆఫీస్​లో బంగారం చోరీ

జామ్ నగర్ :ఇక్కడి కస్టమ్స్ కార్యాలయంలో రూ.కోటీ 10 లక్షలు విలువైన బంగారం చోరీ అయినట్లు ఆ శాఖ అధికారులు పోలీసులకు శుక్ర వారం ఫిర్యాదు చేశారు. భుజ్లోని కస్టమ్స్ శాఖ కార్యాలయం శిథి లం కావటంతో దాన్ని ఎనిమిదో దశకంలో జామ్నగర్కు తరలించారు. అప్పుడే పసిడి మా య మైనట్టు భావిస్తున్నారు. దోపిడీ జరిగి 34 ఏళ్లు గడిచిన తర్వాత విషయం వెలుగులోకి రావడం గమనార్హం. విచారణ చేపట్టేందుకు అహ్మదా బాద్ కస్టమ్స్ ప్రధాన కార్యాలయం అధికారులు ఇక్కడకు వచ్చారు. పోలీసులూ కేసు దర్యాప్తు ప్రారంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos