న్యూ ఢిల్లీ: డీఎంకే నేతృత్వంలోని విపక్షాలు శుక్రవారం ఇక్కడ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టాయి. కేంద్రం అమలు చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు నిరసనలు చేపడుతుండటం ఇందుకు కారణం. ‘వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దీక్ష చేపట్టేవారు జాతీయ వ్యతిరేకవాదులని కేంద్రం చెబుతోంది. దీన్ని మేం ఖండిస్తున్నాం. మేం రైతులకు మద్దతుగానే నిలుస్తాం’అని డీఎంకే అధ్యక్షుడు ఎమ్ కే స్టాలిన్ తేల్చి చెప్పారు. లోక్‌సభ సభ్యులు కనిమొళి కూడా ఆందోళనలో పాల్గొన్నారు.