కోల్కతా : కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని అరుదుగా సద్వినియోగించి ,ఘోరంగా దుర్వినియోగం చేస్తోందని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మండి పడ్డారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు-భోలానాథ్ పాండే, రాజీవ్ మిశ్రా, ప్రవీణ్ త్రిపాఠీల కేంద్రం సేవలకు పంపించాలని జారీ చేసిన ఆదే శాలను పాటించడంలో విఫలమయ్యారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, డీజీపీకి పంపిన లేఖలో పేర్కొంది. ఐపీఎస్ పిబ్బంది నియమాల్లోని 6(1) సెక్షన్ ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరకపోతే, కేంద్రంనిర్ణయాన్నే అమలు చేయాలి. దీనిపై మ మత బెనర్జీ వరుస ట్వీట్లలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక రాష్ట్ర పరిథిని అతిక్రమిస్తోంది. రాష్ట్రంలో పని చేస్తున్న అధికారుల నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం. ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ చర్య సమాఖ్య నిర్మాణ మౌలిక లక్షణాలకు విఘాతం. ఇది రాజ్యాంగ విరుద్ధం. అమోదయోగ్యం కాదు. రాష్ట్ర యంత్రాంగాన్ని పరోక్షంగా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అనుమతిం చేది లేదు. సామ్రాజ్యవాద, అప్రజాస్వామిక శక్తుల ముందు పశ్చిమ బెంగాల్ మోకరిల్లబోద’న్నారు.