నింగిలోకి దూసుకెళ్లిన సీఎంఎస్-01

నింగిలోకి దూసుకెళ్లిన సీఎంఎస్-01

శ్రీహరికోట: ఇక్కడి సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఇస్రో రోదశిలోకి సమాచార ఉపగ్రహం సీఎంఎస్-01ను విజయవంతంగా
ప్రయోగించింది. రెండో ప్రయోగ వేదిక నుంచి వాహకం-పీఎస్ఎల్వీ సీ-50 సరిగ్గా సాయంత్రం 3.41 గంటలకు ఉపగ్రహాన్ని మోసుకుంటూ నిప్పులు చెరుగుతూ నింగి కెగసింది. వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడిని ఈ ప్రయోగాన్ని గురువారం చేపట్టారు. దీంతో మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్కు విస్తరిస్తుంది. ఏడు సంవత్సరాలపాటు సేవలు అందించనున్న ఈ ఉపగ్రహం బరువు 1410 కిలోలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. సి-బ్యాండ్ సేవల విస్తరణకు ఈ ప్రయోగం దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos