న్యూ ఢిల్లీ : పురుషునితో స్త్రీ చాలా కాలం అన్యోన్యంగా ఉన్నట్లయితే, పెళ్లి పేరుతో సెక్స్ చేయడం అత్యాచారం కాబోదని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ విభు భక్రు ధర్మాసనం గురువారం పేర్కొంది. ఒక యువతి దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ తీర్పు చెప్పింది. నిరవధిక కాలంపాటు అన్యోన్యంగా ఉన్నపుడు, పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని సెక్స్ వైపు ఆకర్షించేందుకు ప్రోత్సహించడంగా చెప్పలేమని తెలిపింది. కొన్ని కేసుల్లో పెళ్ళి చేసు కుం టా ననే వాగ్దానం చేసిన తర్వాత సెక్స్‌కు అంగీకరిస్తారని గుర్తు చేసింది. ‘కొన్ని కేసుల్లో పెళ్లి చేసుకుంటాననే వాగ్దానం సెక్సు కోసం ప్రలోభ పరచే అవకాశం ఉంది. సంబంధితులు అది వద్దని చెప్పాలనుకున్నా ప్రలోభాలు ఆక్షణంలో సమ్మతిని రాబట్టే అవకాశం ఉంది. పెళ్లి చేసుకుంటాననే తప్పు డు హామీ ఒకరి సమ్మతిని బలహీనపరిచే అవకాశం ఉంటుంది. భారత శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారం నేరం అవుతుందని తెలిపింది. ఎక్కువ కాలం పాటు అన్యోన్యంగా ఉన్న సందర్భంలో దీనిని అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని’ పేర్కొంది. ఒక యువతి దాఖలు చేసిన వ్యాజ్యంపై గురు వారం విచారణ చేసింది. ‘నిందితునితో నాకు 2008లో శారీరక సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తి పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. దీంతో నేను ఆయ నతో కలిసి వెళ్లాను. నిందితుడు నాపై అత్యాచారం చేశాడ’ని ఆరోపించారు. నిందితుని హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.