నడ్డా వాహనాలపై రాళ్లదాడి

నడ్డా వాహనాలపై  రాళ్లదాడి

కోల్కతా : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన వాహన శ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. ఇక్కడి డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలే దాడికి దిగి నట్లు ఆరోపించారు. అధికార తృణమూల్ నేతలు నడ్డా వాహన శ్రేణిని ఆపడానికి ప్రయత్నించారని, ఆపకపోవడంతో రాళ్లదాడికి దిగారని వివరిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos