విభేదాల్లేవ్.. కలిసే సాగుతున్నాం : రైతు సంఘాలు

విభేదాల్లేవ్.. కలిసే సాగుతున్నాం : రైతు సంఘాలు

న్యూ ఢిల్లీ : తమ ఉద్యమాన్ని నీరు గార్చాలని ప్రభుత్వం వేసే ఎత్తులకు లొంగబోమని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. ఉద్యమంలో మరి కొందరు రైతులు చేరుతారని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. మరోవైపు అమిత్షాతో చర్చలు జరుగుతున్న సమయంలోనే రైతు సంఘాల మధ్య విభేదాలు వచ్చినట్లు, చీలికలు వచ్చినట్లు వదంతులుఆ వచ్చాయి. ‘మామ మధ్య ఎలాంటి విభేదాలూ లేవు. అందరం ఐకమత్యంతోనే ఉద్యమం చేస్తుం. మా నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే. చర్చలో, మెజారిటీయో కాదు. కొందరు అంగీకరించడం, కొందరు తిరస్కరించడం అనేది కాదు. చట్టాలను రద్దు చేయాలని అన్ని యూనియన్లు ప్రకటిస్తే అదే అందరి డిమాండు. అందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావేలేదు. గతంలో జరిగిన ఐదు సమావేశాలూ హడావుడిగానే జరిగాయి. అవునో, కాదో చెప్పండి అనే అడిగాం. మేము అందరమూ ఐకమత్యంతోనే ఉన్నాం.’ అని శివ కుమార్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos