న్యూ ఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల్ని ‘అంబానీ-అదానీ చట్టాలు’గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ లో అభివర్ణించారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు మించి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.