న్యూ ఢిల్లీ: దేశ ప్రజలకు మరణ శాసనమైన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం తలపెట్టిన భారత్ బంద్కు భారీగా మద్దతు పెరుగుతోంది. ఎన్డీఏ ఇతర విపక్షాలన్నీ బంద్కు బాసటగా రానున్నాయి. లారీల యజమానులు, పది ప్రధాన కార్మిక సంఘాలు, అనేక ఇతర సంఘాలు మద్దతు పలికాయి. బ్యాంక్ ఉద్యోగుల యూనియన్లు కూడా తమ గళాన్ని వినిపించాయి. తారలు ప్రియాంకా చోప్రా, సోనమ్ కపూర్ మద్దతు తెలిపారు. చట్టాలను రద్దు చేయకుంటే ప్రభుత్వం తనకిచ్చిన అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్రత్నను వాపస్ ఇచ్చేస్తానని బాక్సర్ విజేందర్ సింగ్ ప్రకటించారు. నలువైపుల నుంచి రైతులకు సంఘీభావం పెరగడంతో మోదీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది.