అంబాలా: హర్యానా హోం మంత్రి అనిల్ విజ్కు మంగళవారం రైతుల నిరసన సెగ తగలింది. ఇక్కడి పంజోఖ్రా సాహిబ్ గురుద్వారా వెలుపల రైతులు ఆయన కారును అడ్డుకుని నల్లజెండాలు ప్రదర్శించారు. రైతు ఐక్యత వర్ధిల్లాలనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పంజాబ్ రైతులు మా కామ్రేడ్లే. హర్యానా నుంచి మా రైతులెవరూ నిరసనల్లో పాల్గొనడం లేదని భాజపా నేతలు చెబుతున్నారు. ఆ కారణంగానే బీజేపీ నేతకు, కేంద్ర ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతున్నాం. నల్ల జెండాలతో మా అసంతృప్తిని వెలిబుచ్చుతున్నాం’ అని నల్లజెండాల నిరసనలో పాల్గొన్న రైతు ఒకరు తెలిపారు.