న్యూ ఢిల్లీ: సత్యం కోసం రైతులు చేసే పోరాటాన్ని ప్రపంచంలోని ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని హెచ్చరించారు. ఛలో దిల్లీ పేరిట రైతులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపారు. మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. సత్యంపై అహంకారం ఎప్పుడూ గెలవదని ఉద్ఘాటించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని ‘I am WithFarmers’ హాష్ట్యాగ్తో హిందీలో ట్వీట్ చేశారు.వ్యవసాయ నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్, హరియాణా రైతులు.. న్యూ ఢిల్లీ బాట పట్టారు. తీవ్ర ఉద్రిక్తతల అనంతరం బురారీలోని నిరంకారీ సమాగం మైదానంలో శాంతియుత నిరసనలు చేసుకునేందుకు పోలీసులు అనుమతిచ్చారు.