బళ్లారిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఘన స్వాగతం

బళ్లారిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఘన స్వాగతం

బళ్లారి : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం  వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బళ్లారిలో ఘన స్వాగతం లభించింది. ఆయన బళ్లారి నగరంలోని శ్రీ కనక దుర్గ ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనను కలుసుకుని ఆప్యాయంగా పలకరించారు .శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన బైరెడ్డి బళ్లారి నగరంలోని శ్రీ కనకదుర్గమ్మతో పాటు హోస్పేట సమీపంలోని హంపీ విరూపాక్ష ఈశ్వర స్వామిని దర్శించుకున్నారు. తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఇళ్ల వద్దకు వెళ్లి, వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో  ఆయన అభిమానులు రోసి రెడ్డి, జిందాల్ పవన్, ఏపీఎంసీ అధ్యక్షుడు శేషి రెడ్డి, పార్టీ అభిమానులు యుగంధర్ రెడ్డి, ఇ.  ఉమాకాంత్ రెడ్డి, నరేష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos