కోలకత్తా: శాసనసభ ఎన్నికలపుడు భాజపా పాలకులు తనను అరెస్ట్ చేసినా చెరసాల నుంచే అఖండ విజయాన్ని సాధించి చూపిస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.బుధవారం ఇక్కడ విలేఖరులతోమాట్లాడారు. ‘బీజేపీ కేవలం రాజకీయ పార్టీయే కాదు. అదొక అబద్ధాల పుట్ట. ఎప్పుడు ఎన్నికలొస్తే… అప్పుడు నారదా శారదా స్కాం ను బయటికి లాగుతారు. ఒక్కటి మాత్రం స్పష్టం. భాజపా, దాని సంస్థలకు భయపడే ప్రసక్తే లేదు. వారు నన్ను అరెస్ట్ చేసి, జైలుకు పంపినా జైలు నుంచే ఎన్నికల్లో పోరాడతా. తిరిగి అఖండ విజయాన్ని సాధిస్తా. లాలూ ప్రసాద్ యాదవ్ను జైల్లో పెట్టినా, ఆర్జేడీ మంచి ఫలితాలనే సాధించింది. బిహార్ లో బీజేపీ విజయం ప్రజాదరణ వల్ల వచ్చిన విజయం కాదు. తృణమూల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో భాజపాయే అధికారికంలోకి వస్తుందని కొందరు ఫిరాయి స్తున్నారు. అవుతున్నార’ని దుయ్యబట్టారు.