గ్యాగ్‌ ఆర్డర్‌ పై స్టే

గ్యాగ్‌ ఆర్డర్‌ పై  స్టే

న్యూఢిల్లీ: అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వు పై అత్యున్నత న్యాయ స్థానం న్యాయమూర్తి అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ వ్యాజ్యాన్ని ఖరారు చేయరాదని ఆదేశించింది. గ్యాగ్ ఉత్తర్వును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సవాలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదించారు. ‘నేరం జరిగిన తర్వాత దర్యాఫ్తు చేయవద్దా. విచారణ వద్దు, మాధ్యమాల్లో ప్రచురించ రాదు అంటారు. ఈ కేసులో అసలు ఏమీ జరగకూడదా. మాజీ అడ్వకేట్ జనరల్ కోర్టును ఆశ్రయిస్తే 13మందికి ఈ ఉత్తర్వు ఎలా వర్తింపజేస్తారు. కేసు వివరాలు ఎందుకు వెల్లడి కారాదా? పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తార’ని రాజీవ్ ధావన్ ప్రస్తావించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos