క్షేత్ర స్థాయిలో ఉనికిని కోల్పోతున్నాం

క్షేత్ర స్థాయిలో ఉనికిని కోల్పోతున్నాం

న్యూ ఢిల్లీ :ఇటీవలి ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులపై లోతైన సమీక్ష అవసరమని కేంద్రం ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం బుధవారం ట్టిట్టర్లో అభిప్రాయపడ్డారు. ‘గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా ఆందోళన చెందా. ఈ ఫలితాలను చూస్తుంటే క్షేత్ర స్థాయిలో పార్టీ ఉనికిని కోల్పోతోందని అర్థమవుతోంది. అంతే కాకుండా క్రమ క్రమంగా పార్టీ ఢీలా పడుతోందని అనిపిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం ఉన్నా ఎందుకు ఓడిపోయామన్న దానిపై లోతైన సమీక్ష అవసరం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కాంగ్రెస్ విజయం సాధించి ఎన్నో రోజులు గడవలేదు అన్న విషయాన్ని గుర్తుంచు కోవాలి. అత్యంత చిన్న పార్టీలైన సీపీఐ-ఎంఎల్, ఎంఐఎం లాంటి పార్టీలు క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నాయి కాబట్టే విజయం సాధించాయన్న సత్యాన్ని బిహార్ ఎన్నికలు చాటాయి. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా లేని కారణంగానే అతి తక్కువ ఓట్లు వచ్చాయి. క్షేత్ర స్థాయిలో బలంగా ఉంటే మాత్రం ఎన్డీయే కూటమి కంటే ఎక్కువ సీట్లే వచ్చి ఉండేవ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos