తేజేశ్వి యాదవ్ గురించి ఈ విషయం తెలుసా ?

తేజేశ్వి యాదవ్ గురించి ఈ విషయం తెలుసా ?

బీహార్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనిస్తున్న మహాగట్బంధన్ కూటమిలో భాగమైన ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ రాజకీయంగానే కాకుండా క్రీడలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.31 ఏళ్ల తేజశ్వి రాజకీయ క్రీడలోకి ప్రవేశించే ముందు మంచి క్రికెట్ ప్లేయర్ కావాలని కలలు కనేవారు.. కాని అతడి కోరిక నెరవేరలేదు.తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న తేజేశ్వి ఐపీల్ లో కూడా ఆడాడు.2008 నుంచి 2012 వరకు ఢిల్లీ తరపున ఆడాడు.దీనిపై తండ్రి లాలూ ప్రసాద్ ఒకసారి తన కొడుకు అదనపు ఆటగాడిగా జట్టులో ఉండటానికి అవకాశం లభించిందని, మైదానంలో కూల్ డ్రింక్స్ సరఫరా చేసేవాడు అని చెప్పాడు. తేజశ్వి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడగలిగాడు. రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్‌లో విదర్భపై 2009 లో రాంచీలో అడుగుపెట్టినప్పుడు జార్ఖండ్ జట్టులో తేజశ్వికి ఈ అవకాశం లభించింది.తేజశ్వి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 19, లిస్ట్ ఎలో 9, టి 20 లో 3 స్కోరు సాధించారు. 2010 లో ఐపీఎల్ ఆటగాడిగా స్థానం సంపాదించుకున్నప్పటికీ, తేజశ్వి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి కోసం ప్రచారం ప్రారంభించారు. లాలూ తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆనాటి ప్రచారంతో స్పష్టమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos