కశ్మీర్ యువతకు ఆయుధాలే అనివార్యం

కశ్మీర్ యువతకు ఆయుధాలే  అనివార్యం

శ్రీనగర్ : ‘అమెరికాలో ట్రంప్ ఓడిపోయారు. ఇక్కడ భాజపాకూ అదే గతి పడుతుంద’ని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌కు  శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ రాజకీయాల్లో కొత్త పంథాను నెలకొల్పారని ప్రశంసించారు. ఎవరైనా సరే జమ్మూ కశ్మీర్‌లో భూములు కొనుగోలు చేయవచ్చన్న నిర్ణయాన్ని ఖండించారు. జమ్మూ కశ్మీర్ వనరులను అమ్మకానికి చూస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్ పండిట్ల పరిస్థితి ఏంటో చెప్పాలని బీజేపీని నిలదీశారు. ‘వారి విషయంలో బీజేపీ పెద్ద పెద్ద హామీలే ఇచ్చింది. వాటి అమలు సంగతి ఏంట’ని ఎద్దేవా చేసారు. జమ్మూ కశ్మీర్‌లో యువకులకు ఎలాంటి ఉద్యోగావకాశాలు లేవని, ఆయుధాలను పట్టడం కంటే యువకులకు వేరే మార్గమే లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో బయటి వ్యక్తులకు ఉద్యోగాలు వస్తున్నాయి కానీ… స్థానికులకు రావడం లేదని మండిపడ్డారు. బీజేపీ మాజీ ప్రధాని వాజ్‌పాయ్ సిద్ధాంతాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని, యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos