చెన్నై: ఇక్కడి ఒక సమాచార సాంకేతిక సంస్థలో రూ. వెయ్యి కోట్ల రూపాయలకుపైగా నల్లధనాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికార్లు గుర్తించారు. నవంబర్ 4న చెన్నై, మధురై, తమిళనాడులోని మరో నాలుగు ప్రాంతాల్లో చేసిన దాడుల్లో నల్లధనాన్ని గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు శనివారం ఇక్కడ వెల్లడించింది. చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఈ కంపెనీలో రూ. వెయ్యి కోట్ల లెక్కచూపని డబ్బును గుర్తించినట్లు వివరించారు. రూ.337 కోట్లపై బినామి, నల్లధనం చట్టాల కింద చర్యలు చేపట్టామని తెలిపింది.