ముంబై: ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అన్నబీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు చక్కటి వీడ్కోలు ఇచ్చేందుకు బీహార్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘నితీశ్ కుమార్ గొప్ప నాయకుడు. ఆయన తన ఇన్నింగ్స్ ఆడేశారు. ఒక నాయకుడు ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పినప్పుడు ఆయనకు కచ్చితంగా వీడ్కోలు పలకాల్సిందే. ఆయనకు మంచి వీడ్కోలు వెల్ ఇచ్చేందుకు బీహార్ ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని చెప్పారు. నితీశ్ వ్యాఖ్యలపై జేడీయూ నేతలు స్పష్టీకరణ ఇచ్చారు. ‘రాజకీయాలకు నితీశ్ దూరం కావడం లేదు. నితీశ్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారానికి సంబంధించినవి మాత్రమేన’ని వివరించారు.