మళ్లీ వాళ్ల ఫోటోలను గోడలపై అతికించారు

మళ్లీ వాళ్ల ఫోటోలను గోడలపై అతికించారు

లక్నో: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ) లకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారిలో 14 మంది నిందితుల ఫోటోలను బహిరంగ ప్రదేశాల్లో అతికించారు. వీరిని పట్టించిన వారికి రూ.5 వేల వరకు నగదు బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. వీరిలో ఎనిమిది మందికి ఇది వరకే వ్యతిరేకంగా గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసులు దాఖలయ్యాయి. గతంలోనూ స్థానిక అధికారులు కొందరు సీఏఏ, ఎన్సార్సీ వ్యతిరేక ఆందోళేన కారుల ఫోటోల హోర్డింగ్లు పెట్టారు. వీరిలో పలువురు గతేడాది డిసెంబర్ 19న లక్నోలో జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు ఆరోపించారు. గతంలో సీఏఏ ఆందోళనకారుల హోర్డింగులను తొలగిం చాలని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. యూపీ ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీని విచారణ ఇంకా ముగియ లేదు. ఈ దశలో పోస్టర్లు పెట్టడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos