చరిత్ర సృష్టించిన జో బైడెన్‌

చరిత్ర సృష్టించిన జో బైడెన్‌

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు, డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లు సాధించారు. కేవలం విజయానికి ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్. విజయంపై పూర్తి స్పష్టత లేకపోయినప్పటికి బైడెన్ ఓ రికార్డు నెలకొల్పారు. అమెరికా చరిత్రలోనే అత్యధిక ఓట్లు సంపాదించిన అధ్యక్ష అభ్యర్థిగా అగ్ర స్థానంలో నిలిచారు. ఒబామా నెలకొల్పిన రికార్డును తిరగరాశారు. 2008 ఎన్నికల్లో ఒబామా 66,862,039 సాధించగా.. ప్రస్తుతం బైడెన్ 72,048,770 సాధించారు. అయితే ఓటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఓట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos