యవ్వనంలో మోడీ ఆత్మ పరిశీలన

యవ్వనంలో మోడీ ఆత్మ పరిశీలన

‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ (ముంబైకి చెందిన కొందరు కథా రచయితలు ఏర్పాటు చేసిన సంస్థ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జీవిత లక్ష్యాన్ని అన్వేషించడానికి యవ్వనంలో తాను చేసిన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ప్రధాని మోదీ వివరించారు. ఈ ఇంటర్వ్యూని బుధవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ”చాలా మందికి ఈ విషయం తెలియదు. ప్రతి దీపావళికి అయిదు రోజుల పాటు ఎవరికీ కనిపించేవాడిని కాదు. అడవిలోకి వెళ్లిపోయేవాణ్ణి. మనుషులెవరూ ఉండని, మంచినీరు దొరికే ప్రదేశాన్ని చూసుకునేవాడిని. ఐదు రోజులకు సరిపడా ఆహార పదార్థాలను తీసుకెళ్లేవాడిని. ‘ఎవర్ని కలవడానికి వెళ్తున్నావు?’ అని ఎవరైనా అడిగేవారు. నన్ను నేను కలుసుకోవడానికి వెళ్తున్నానని చెప్పేవాడిని” అని మోదీ పేర్కొన్నారు. ఉరుకులు, పరుగులతో జీవితాలను గడిపే యువత ఏదో ఒక సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని మోదీ సూచించారు. తాను 17 ఏళ్ల వయసులో రెండేళ్ల పాటు హిమాలయ యాత్ర చేశానని కూడా మోదీ చెప్పారు. ”ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఏమి చేయాలో అంతకన్నా తెలియదు. చెప్పేవారు లేరు. ఏదో ఒకటి చేయాలన్న బలమైన కోరిక మాత్రం ఉండేది. అందుకే నన్ను నేను దేవునికి సమర్పించుకొని హిమాలయాలకు వెళ్లా” అని తెలిపారు. ”ఎన్నో సమాధానాలు లభించాయి. నన్ను నేను తెలుసుకున్నాను. రామకృష్ణ మిషన్‌లో కాలం గడిపాను. సాధువులను కలిశాను. మనలోని అహంకారాన్ని పూర్తిగా తొలగించినప్పుడే నిజమైన జీవితం ఆరంభమవుతుంది. రెండేళ్ల తరువాత స్పష్టమైన ఆలోచనలతో జీవిత గమ్యాన్ని తెలుసుకొని ఇంటికి చేరుకున్నా” అని మోదీ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos