యాచకురాలిని అరెస్ట్ చేస్తే షాకింగ్ విషయం తెలిసింది..

యాచకురాలిని అరెస్ట్ చేస్తే షాకింగ్ విషయం తెలిసింది..

ఈజిప్టులో భిక్షాటన చేస్తున్న ఒక మధ్యవయస్కురాలిని పోలీసులు అరెస్టు చేశారు. యాచకురాలి (నఫీసా)ని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందంటారా? దీనికి కారణం లేకపోలేదు. ఆ దేశంలోని పలు ప్రావిన్సులో ఆమె ఒక కాలు లేని దానిలా నటిస్తూ.. వీల్ ఛెయిర్ లో అడుక్కునేది.సాయంత్రం అయ్యాక.. ఎంచక్కా వీల్ ఛైర్ మడతపెట్టి.. నడుచుకుంటూ వెళ్లిపోయేది. ఈ విషయాన్ని పలువురి గుర్తించి పోలీసులకు ఈ సమాచారం ఇవ్వటంతో ఆమెను అరెస్టు చేశారు. పక్షవాతంతో తన కాలు పని చేయటం లేదని పోలీసులకు చెప్పినా.. అది నిజం కాదని తేలింది. ఆమె మాటలు తేడాగా అనిపించటంతో ఆమె విషయంలో మరింత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు.సదరు మహిళకు సంబంధించిన వాస్తవాలు బయటకు రావటంతో విచారణ అధికారులతో పాటు పోలీసులు సైతం షాక్ తిన్నారు. అతి దీనంగా అడుక్కునే ఆమెకు ఖలిబుయా గవర్నరేట్స్ లో ఐదు ఇళ్లు ఉన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. ఆమెకు రెండు బ్యాంకు ఖాతాలు ఉండటం.. వాటిల్లో ఉన్న నగదు ఏకంగా రూ.1.42కోట్లు కావటం మరో విశేషం.కోటీశ్వరురాలైన ఆమె భిక్షాటన చేస్తున్న వైనం పలువురు జీర్ణించుకోలేని పరిస్థితి. ఆమె విషయంలో మరింత లోతుగా దర్యాప్తు జరిపి.. కోర్టులో హాజరు పరుస్తామని చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos