జైపూర్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అమలు చేయవలసిన అవసరం లేకుండా చేయడానికి రాజస్థాన్ శాసనసభలో సభా వ్యవహారాల మంత్రి శాంతి ధారివాల్ శనివారం మూడు ముసాయిదాల్ని ప్రవేశ పెట్టారు.అవి- నిత్యావసర వస్తువులు (ప్రత్యేక నిబంధనలు, సవరణ) ముసాయిదా-2020; ధరల హామీ, వ్యవసాయ సేవల ( సవరణ)పై రైతుల (సాధికారత, పరిరక్షణ) ఒప్పందం ముసాయిదా 2020; వ్యవసాయోత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహం, సదుపాయం, రాజస్థాన్ సవరణ) ముసాయిదా. పంజాబ్ ప్రభుత్వం కూడా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ముసాయి దాల్ని ఆమోదించింది. వీటిపై చర్చించేందుకు నవంబరు 2-5 తేదీల మధ్యలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమయాన్ని పంజాబు ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు.