ఎటువంటి అండ,బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవి రియర్లో చాలా వరకూ హిట్ సినిమాలే చేశారు.అప్పట్లో చిరంజీవి చిత్రాలు సృష్టించిన రికార్డులు చాలాకాలం వరకు పదిలంగా ఉన్నాయి.మరి కొన్ని ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి.ఇక చిరంజీవికి తనతో పాటు తనవాళ్లూ కూడా ఎదగాలన్నది బలమైన ఆకాంక్ష.అందుకే చిరును చిత్ర సీమలో అందరూ అన్నయ్య అని పిలుచుకుంటారు, ఆయనకు సినిమా పరిశ్రమలో మంచి మిత్రులు అంటే సుధాకర్ హరిప్రసాద్..చిరంజీవి చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటున్న రోజుల్లో నటులు సుధాకర్, హరిప్రసాద్లతో మంచి స్నేహం ఏర్పడింది.సినిమాలు కూడా కలిసి చేయడంతో వారితో ఎంతో సరదాగా ఉండేవారు, చిత్ర సీమలో సుధాకర్ మంచి కమెడియన్ గా ఎదిగారు.విలన్గా, హరిప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకున్నారు.. ఇలాంటి సమయంలో సుధాకర్, హరిప్రసాద్ నిర్మాతలుగా మారి చిరుని ఓ సినిమా చేయమని కోరారు.. వీరి కాంబోలో దేవాంతకుడు సినిమా 1984లో విడుదల అయింది. అంతగా ఆడలేదు.ఇక వారికి నష్టాలు వచ్చాయి, అయితే తన స్నేహితులు నష్టపోకూడదు అని చిరు భావించారు, మరో సినిమా చేస్తాను అని చెప్పారు.. సూపర్ ఫిల్మ్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో 1988లో యముడికి మొగుడు చేశారు, ఇది సూపర్ హిట్ అయింది వారికి నష్టాలు పోయి లాభాలు వచ్చాయి, స్నేహితులు ఇద్దరూ ఆర్దికంగా నిలదొక్కుకున్నారు. అందుకే చిరు అంటే అందరికి అంత అభిమానం.
.