నల్ల రిబ్బన్లలో ‘మహా’ మంత్రుల విధులు

నల్ల రిబ్బన్లలో ‘మహా’ మంత్రుల విధులు

ముంబై: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాద పరిష్కారానికి డిమాండు చేస్తూ మంత్రివర్గ సభ్యులు ఆదివారం-కర్ణాటక అవతరణ దినోత్సవాన నల్ల పట్టీలు ధరించి విధులకు హాజరు కానున్నారు. ‘బెల్గాంను మహారాష్ట్రలో కలుపుకొనేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. అది జరిగిన రోజు చారిత్రకం అవుతుంది. ఆ ప్రాంత ప్రజలకు మేం అండగా ఉన్నాం. 6 దశాబ్దాలకు పైగా దీనిపై పోరాటం జరుగుతోంది. త్వరలోనే బెల్గాం, కార్వార్, నిపాని, బీదర్, భాల్కీ ప్రాంతాలను మహారాష్ట్రలో చేర్చుతాం. ఈ ప్రాంతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. యెల్లూర్ ప్రజలపై జరిగిన దాడులను మరాఠీలు తీవ్రంగా వ్యతిరేకించారు‘అని వివాద పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కర్తలుగా నియమించిన మంత్రులు ఏక్నాథ్ శిందే, ఛాగన్ భజ్బుల్ బెళగావి మరాఠీలకు రాసిని లేఖలో వివరించారు. కర్నాటకలోని బెళగావి , కార్వార్, నిప్పాణి ప్రాంతాలు తమవని మహారాష్ట్ర చెబుతోంది. అక్కడ అధికులు మరాఠీ భాష మాట్లాడతారు. ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలపాలని ఎన్నో ఏళ్లుగా వాదిస్తోంది.ఈ వివాదం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే మరాఠీలు నవంబరు 1ని నిరసన దినంగా పాటిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos