ప్రపంచ వ్యాప్తంగా గుండెలు పిండేస్తున్న ఫోటో..

ప్రపంచ వ్యాప్తంగా గుండెలు పిండేస్తున్న ఫోటో..

టర్కీలో భూకంపం కారణంగా భారీ ఆస్తినష్టంతో పాటు.. ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు మరణాల సంఖ్య తక్కువగానే నమోదైనా.. లెక్క పూర్తి అయ్యేనాటికి ఎక్కువమందే బాధితులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ విషాద వేళ.. ఒక ఫోటో ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. ఒక భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన ఒక వ్యక్తి కోసం.. అతడి పెంపుడు కుక్క దీనం చూస్తున్న వైనం గుండె కలుక్కుమనేలా చేస్తోంది.నన్నెంతో ప్రేమగా చూసుకున్న వ్యక్తి.. కష్టంలో ఉన్నాడు.. కాపాడు దేవుడా అన్నట్లుగా ఉన్న ఈ కుక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టర్కీ భూకంప విషాద తీవ్రత ఎంతన్నది ఈ ఫోటో చెప్పేస్తుందని చెబుతున్నారు. శిథిలాల కింద ఇరుక్కుపోయి.. చేతి మాత్రం బయటకు రావటం.. దాని పక్కనే కూర్చున్న పెంపుడు కుక్క.. తానేమీ చేయలేని అశక్తతో చుట్టూ ఉన్న వారిని సాయం చేయాలని వేడుకున్నట్లుగా దీనంగా ఉంది.ఈ ఫోటోను చూస్తున్న వారి గుండె బరువెక్కిపోయేలా చేస్తున్న ఈ ఫోటో ఇప్పుడు అందరిని ఆవేదనకు గురి చేస్తోంది. ఏజియన్ సముద్రంలో 16.6 కిలోమీటర్ల లోతులో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ భారీ భూకంపం తీవ్రత 6.6గా లెక్కించారు. ఈ భూకంపం ధాటికి అక్కడి సముద్రంలో స్వల్ప సునామీ ఏర్పడటంతో.. సముద్ర జలాలు తీర ప్రాంతంలోని నివాసాలపై ఎగిసిపడ్డాయి. ఓపక్క భూకంపం.. మరోవైపు స్వల్ప సునామీతో టర్కీలోని బాధిత ప్రాంతం భారీ విధ్వంసాన్ని,విషాదాన్ని మిగిల్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos