రహదారిపై ఫ్రెంచ్ అధ్యక్షుడి చిత్రాలు

రహదారిపై ఫ్రెంచ్ అధ్యక్షుడి  చిత్రాలు

ముంబై: నగరంలోని అత్యంత రద్దీగా ఉండే భేండి బజార్లో పాదాచారులు, వాహనాలు వెళ్లే రోడ్డుపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానూయేల్ ఫొటోల్ని శుక్రవారం అతికించడం కలకలాన్ని సృష్టించింది. ఓ రోడ్డుపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానూయేల్ మాక్రోన్ చిత్రాలను అతికించారు. ఆ చిత్రాలపై నుంచి వాహనాలు వెళ్లాలనేది నిరసన కారుల ఆశయం. దీన్ని పసి గట్టిన పోలీసులు వెంటనే వాటిని తొలగించారు. ఫ్రాన్స్లో కార్టూన్ ఉదంతం, అనంతరం జరిగిన హత్యపై ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానూయేల్పై ముస్లిం దేశాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సంబంధిత వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలన మయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే రహదారిపై అతికించిన చిత్రాలను తొలగించామని పోలీసు అధికార్లు తెలిపారు. ఎవరిపై ఇప్పటి వరకు ఎవరి పైనా కేసు నమోదు చేయ లేదు. దర్యాప్తు ప్రారంభించా మని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos