పట్నా: తాము అధికారంలోకి వస్తే పది లక్షల మందికి ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇచ్చిన హామీ ఉత్తిదేనని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. శుక్రవారం పర్భట్టాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘15 ఏళ్లపాటు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ముఖ్యమంత్రులుగా పనిచేసారు. అప్పుడు బిహార్ను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. వారి హయాంలో కేవలం 95,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించాం. ఆర్జేడీ చెప్పేదంతా బోగస్ మాటలేన’ని కొట్టి పడేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి కూడా నాలుగు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు, 15లక్షల ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చింది.