పుల్వామా దాడి మా పనే..

పుల్వామా దాడి మా పనే..

పాకిస్థాన్ దుష్టపన్నాగం మరోసారి బయటపడింది. భారత్‌లో 40మంది సీఆర్ పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడి తామే చేశామంటూ పాకిస్తాన్ తెలిపింది. ఇది తమ విజయంగా చెప్పుకుంది.పుల్వామా దాడి తమది కాదంటూ బుకాయిస్తు వచ్చిన పాక్.. ఎట్టకేలకు అది తమ పనే అని అంగీకరించింది. అంతేకాదు అది ఇమ్రాన్ సర్కారు ఘనతగా సాక్షాత్తు పార్లమెంట్‌లో ప్రకటించుకుంది. భారత్‌లోకి దూసుకెళ్లిమరీ పుల్వామా దాడికి పాల్పడినట్లు పాక్ మంత్రి ఫవాద్ చౌదురి పార్లమెంట్‌లో వెల్లడించాడు.భారత్‌ను వారిగడ్డపైనే దెబ్బాకొట్టామని, పుల్వామాలో విజయం సాధించామంటూ తెలిపాడు. ఇమ్రాన్ నాయకత్వంలో పాక్ విజయం సాధించిందని గొప్పలు చెప్పాడు. దీంతో పాకిస్తాన్ దుష్టపన్నాగం మరోసారి ప్రపంచానికి తెలిసింది.పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ… ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలను పాక్ ప్రతిపక్ష నేత అయాజ్ సాదిఖి వెల్లడించారు. ఈ నేపధ్యంలో మంత్రి ఫవాద్ చౌదురి ఈ వ్యాఖ్యలు చేశారు.పాక్ పార్లమెంటు మోదీ.. మోదీ నినాదాలతో దద్దరల్లింది. బలూచిస్తాన్‌కు చెందిన ఎంపీలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషీకి చిర్రెత్తుకొచ్చింది. ప్రసంగం మధ్యలోనే ఆపేసి సభ నుంచి వాకౌట్‌ చేసిన వెళ్లిపోయారు. బలూచిస్తాన్‌ ఉద్యమం గురించి ఖురేషి ప్రసంగిస్తుండగా… ఎంపీలు మోదీని పొగుడుతూ నినాదాలు చేశారు. అటు మంత్రి ప్రసంగానికి పదేపదేల అడ్డు తగిలారు. ఆ ఎంపీల హృదయాల్లో మోదీ చొచ్చుకుని పోయారని ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos