కొండెక్కిన పూల ధరలు

కొండెక్కిన పూల ధరలు

హోసూరు : పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హోసూరు పట్టణంలో దసరా సంబరాలు జోరుగా నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా హోసూరు ప్రజలు పూలు, పళ్ళు కొనేందుకు రావడంతో హోసూరు పట్టణ వీధులు జనసంద్రంగా మారాయి. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో హోసూరు ఉన్నందున ఇక్కడ పూలు తక్కువ ధరలకు దొరుకుతుందని బెంగళూరు చుట్టుపక్కల ప్రజలు సైతం ఆయుధ పూజలకు గాను పూలు కొనుగోలుకు హోసూరుకు
రావడంతో పుర వీధులు మరింత కిక్కరిసిపోయాయి. హోసూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమలలో ఆయుధ పూజలకు గాను పరిశ్రమల నిర్వాహకులు పూలను కొనుగోలు చేయడంతో పూల ధరలకు రెక్క లొచ్చాయి.హోసూరు పూల మార్కెట్ లో కిలో చేమంతి 250,కిలో కనకాంబరాలు 1500, మల్లె లు 800, బటన్ రోస్ కిలో 250, సన్నజాజులు కిలో 7 వందలకు విక్రయించారు. పూలధరలు పెరగడంతో రైతులకు కాస్త ఊరట కలిగినా వినియోగదారులకు కాస్త బారమే అనిపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos