హోసూరు వద్ద సంచలన లారీ దోపిడీ

హోసూరు వద్ద సంచలన లారీ దోపిడీ

హోసూరు సమీపంలో లారీని అడ్డగించి రూ.10 కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లను చోరీ చేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చెన్నై పూందమల్లి నుండి బెంగళూరు వైపు వస్తున్న లారీని వేకువ జామున గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు మరో లారీలో వచ్చి సూలగిరి సమీపంలోని అలగుబావి వద్ద అడ్డగించారు. లారీని నిలిపిన డ్రైవర్ అరుణ్, సతీష్ కుమార్లపై దుండగులు దాడి చేసి ఇద్దర్ని కట్టి పడేసి లారీలో ఉన్న1440 సెల్ ఫోన్లను దోచుకెళ్లారు. ఇద్దరూ స్థానికుల సహాయంతో క్రిష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి చేరుకొని పోలీసులకు పిర్యాదు చేసారు. అప్రమత్తమైన పోలీసులు అన్ని చెక్ పోస్టులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన హోసూరు డీఎస్ పి మురళి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. సేలం డిఐజి ప్రదీప్ కుమార్ రంగంలోకి దిగి ఘటనా స్థలాన్ని పరిశీలంచారు. లారీలో సెల్ ఫోన్లను చోరీ చేసి మరో లారీలో పరారైన వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేసారు. వారం రోజుల క్రితం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు సరి హద్దు సత్యవేడు వద్ద ఇదే తరహాలో దుండగులు లారీలో సెల్ ఫోన్లను చో రీ చేసిన సంఘటన మరువక ముందే హోసూరు సమీపంలో మరో సంఘటన జరగడం సంచలనం సృష్టించింది. ఈ రెండు చోరీలు ఒకే బృందం చేసిందా లేక వేరే ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos