రెండు నెలల్లో రూ.10వేలు వేస్తాం: చంద్రబాబు

రెండు నెలల్లో రూ.10వేలు వేస్తాం: చంద్రబాబు

 సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా డ్వాక్రా మహిళలకే ఉందని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో నిర్వహించిన ‘పసుపు-కుంకుమ’ సభలో సీఎం మాట్లాడారు.  నాలుగున్నరేళ్లలో పసుపు-కుంకుమ కింద రూ.21,116 కోట్లు అందజేశామని చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆడబిడ్డలు ఆధారపడకూడదని సీఎం అన్నారు. రాబోయే రెండు నెలల్లో ఒక్కో డ్వాక్రా మహిళ బ్యాంకు ఖాతాలో రూ.10వేలు చొప్పున జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మూడు విడతలుగా చెక్కుల రూపంలో వాటిని అందజేస్తామన్నారు. సీఎం ప్రకటనతో సభలోని మహిళల్లో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రిక

ప్రపంచంలో ఎక్కడైనా మహిళలకు రూ.20వేలు సాయం చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందుకే ఎప్పటికీ తన మనసులో డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేకస్థానం ఉంటుందని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ కూడా అందజేస్తామని సీఎం ప్రకటించారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనూ మహిళలకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos