డిక్లరేషన్ వివాదంలో తప్పెవరిది?

డిక్లరేషన్ వివాదంలో తప్పెవరిది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హిందువులపై పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని అందుకు అహఁధికార వైసీపీ,మంత్రులు,ఎమ్మెల్యేలు సైతం సహకరిస్తున్నారని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు,తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ అవసరం లేదనే వాదనలు ఇవన్నీ అనుమానాలు పెంచుతున్నాయి.చర్చిలు,మసీదులపై జరగని దాడులు కేవలం హిందూ ఆలయాలపై ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వైసీపీ అధికారంలోకి వచ్చాక మత మార్పిడులు ఊపందుకున్నాయని,నిరక్షరాస్యులను మభ్య పెట్టి మత మార్పిడులకు పాల్పుడుతున్నారనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.తాజాగా జరుగుతున్న పరిణామాలు వీటికి మరింత బలం చేకూర్చుతున్నాయనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.తిరుమలకు వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన బ్రిటిష్ హయం నుంచి వస్తోంది.గత ప్రభుత్వాలు సైతం ఈ విధానాన్ని కొనసాగించాయి.అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ మాత్రం ఈ నిబంధనను ఎందుకు రద్దు చేయాలని అనుకుంటుందో అంతుబట్టడం లేదు.డిక్లరేషన్ ఇవ్వడానికి తిరుమలకు వచ్చే అన్యమతస్థులు లేని అభ్యంతరాలు వైసీపీ ప్రభుత్వానికి,మంత్రులకు,ఎమ్మెల్యేలకు ఎందుకో ? వైసీపీ అధినేతను ఆకట్టుకోవడానికి డిక్లరేషన్ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా ? కేవలం కొంతమంది కోసం దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానాలను మార్చాలనే తాపత్రయం ఎందుకో ? దీనిపై కొంతమంది నేతలు హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే కచ్చితంగా అధిష్టానం ప్రోద్బలం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని మాటలు వినిపిస్తున్నాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos