కోర్టులను విమర్శించిన విజయసాయిరెడ్డి..

కోర్టులను విమర్శించిన విజయసాయిరెడ్డి..

రాజ్యసభలో కరోనా వైరస్ పై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.కొవిడ్‌పై చర్చ ప్రారంభించి… ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ.. ఇతర అంశాలను విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.రాజ్యసభలో కొవిడ్‌పై చర్చ సందర్భంగా.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సబ్జెక్ట్ దాటి మాట్లాడంపై… డిప్యూటీ చైర్మన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.డిప్యూటీ చైర్మన్‌ అనేకమార్లు.. వారిస్తున్నా విజయసాయిరెడ్డి తనధోరణిలో వెళ్లిపోయారు. సంబంధింత అంశానికి మాత్రమే పరిమితం కావాల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సూచించారు. విజయసాయి చర్చను తప్పుదోవపట్టిస్తున్నారని… టీడీపీ ఎంపీ కనకమేడల అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంటులో మాట్లాడం ద్వారా… కోర్టులనుకూడా.. బెదిరింపులకు పాల్పడుతున్నారని కనకమేడల ఆరోపించారు. కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడాల్సిన చోట… ఇతర అంశాలను ప్రస్తావించడం ఏమిటని కనక మేడల ప్రశ్నించారు.అనంతరం పార్లమెంట్ ఆవరణం వెలుపల మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని న్యాయ వ్యవస్థ విస్మరిస్తోందని చెప్పారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయని, మీడియా గొంతు నొక్కుతున్నాయని జుడీషియరీపై ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఏపీలో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఏపీ హైకోర్టు విధించిన స్టేలకు సంబంధించి న్యాయపరమైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos