బీరూట్: కరోనా సామాజిక రోగ నిరోధకత సాధిస్తే, సీజనల్ వ్యాధిగా మారుతుందని ఇక్కడి అమెరికన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. సామాజిక రోగ నిరోధకత సాధించే వరకు ప్రతీ సీజన్లోనూ ఇది పలుమార్లు వస్తూనే ఉంటుందని శావేత్తలు వివరించారు. శ్వాస కోశ సంబంధ వైరస్లు సీజన్ల వారీగా ఎలా విజృంభిస్తున్నాయి? భవిష్యత్తులో వాటి పరిణామాలు అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. ‘సామాజిక రోగ నిరోధకత సాధించాక కరోనా వ్యాప్తి దానంతట అదే తగ్గిపోతుంది. తర్వాత సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే వైరస్ కనిపిస్తుంద’ని అధ్యయనకర్త హసన్ జారేకేత్ తెలిపారు. ప్రజలు కూడా కరోనాకు అలవాటు పడాలని, కరోనాను దూరంగా ఉంచేందుకు ఇప్పటిలానే మాస్కులు ధరించడం, చేతులను నిత్యం శుభ్రం చేసుకోవడం మాత్రం తప్పని సరన్నారు.