హోసూరులో అన్నాదురై జయంతి

హోసూరులో అన్నాదురై జయంతి

హోసూరు : తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అన్నాదురై 112వ జయంతిని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఘనంగా జరుపుకున్నారు. హోసూరులో ఎడిఎంకె, డిఎంకె పార్టీలకు చెందిన నాయకులు అన్నాదురై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీమంత్రి బాలకృష్ణారెడ్డి హోసూరు అన్నానగర్‌లో గల అన్నాదురై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించగా, డిఎంకె పార్టీనాయకులు హోసూరు తాలుకాఫీసు సమీపంలోని అన్నా విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అన్నాదురై తమిళనాడు రాష్ట్రానికి చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos