అయోధ్య: రామ మందిర నిర్మాణ బాధ్యతల్ని చూస్తున్న శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల నుంచి నకిలీ చెక్‌లతో భారీగా నగదు విత్‌డ్రా అయింది. ఇప్పటికే రెండు సార్లు భారీ మొత్తంలో నగదును ఉపసంహరించారు. మూడోసారి కూడా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినపుడు ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందింది.సెప్టెంబరు 1న లఖ్‌నవూలోని ఒక బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్షన్నర, రెండు రోజుల తర్వాత మరో రూ.మూడున్నర లక్షలు డ్రా చేసారు. రు. బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి రూ.9.86 లక్షలు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించినపుడు సిబ్బందికి అనుమానం వచ్చింది. తనిఖీ కోసం ట్రస్ట్ కు ఫోన్ చేసి అడిగారు. తాము ఎటువంటి చెక్‌ను జారీ చేయలేదని తెలపటంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అయోధ్య పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసారు.