పాట్నా :శాసనసభ ఎన్నికల ముందు విపక్షం రాష్ట్రీయ జనతాదళ్ –ఆర్జేడీకి భారీ దెబ్బ తగిలింది. ఆ పార్టీ , ఉపాధ్యక్షుడు సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ గురువారం ఆయన రాజీనామా లేఖను పార్టీ అధిపతి లాలూప్రసాద్ యాదవ్‌కు పంపారు. రాజీనామాకు గల కారణాలు వెల్లడించ లేదు. విపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో ఆయనకు ఉన్న విభేదాల కారణంగానే పార్టీ నుంచి వైదొలిగనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉంది. ప్రసాద్ గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్జేడీలో లాలూ ప్రసాద్ యాదవ్ తరువాత అత్యంత సీనియర్ నేతగా గుర్తింపు పొందారు.