చెన్నై:నటుడు కమలహాసన్ సారథ్యంలో బిగ్ బాస్ ప్రదర్శనను కోర్టు స్టే ద్వారా అయినా అడ్డుకుంటానని నటి మీరా మిథున్ హెచ్చరించారు. కమల్ సినిమాలో తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించింది. మీరా మిథున్ తమిళ బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆ ప్రదర్శనలో పాల్గొన్న దర్శకుడు చేరన్, తన నడుమును గట్టిగా పట్టేసుకుని గిల్లాడని ఆరోపించారు. పణలు చేయగా, మీరా మిథున్ అబద్ధాలు చెబుతున్నదని అసలు వీడియోను కమల్ ప్రేక్షకులకు చూపినపుడు ఆమె ఖంగుతింది. అప్పటి నుంచి కమల్ పై తన ఆగ్రహాన్ని వీలు చిక్కినప్పుడల్లా ప్రదర్శిస్తూనే ఉంది. ఇంకా త్రిష తన మేకప్ టెక్నిక్స్ ను కాపీ కొడుతోందని ఆరోపించింది. ఇంకా తమిళ నటులు విజయ్, సూర్య ను రెచ్చగొట్టి ప్రజాదరణ పొందింది.