ముంబై:స్టాక్ మార్కెట్లు శుక్ర వారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 580 పాయింట్ల నష్టంతో 38,413 వద్ద , ఎన్ఎస్ఈ-నిఫ్టీ 170 పాయింట్లకుపైగా కోల్పోయి 11,354 వద్ద ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం భారీగా నష్ట పోవటం దేశీయ మదుపరుల నమ్మకాన్ని దెబ్బతీసింది. దీంతో వారంతా అమ్మకాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ షేర్లు అత్యధికంగా నష్టాల్లో ఉన్నాయి.